బీజేపీ సభకు గ్రీన్ సిగ్నల్
స్పాట్ వాయిస్, వరంగల్ : బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం వరంగల్లో ఆర్ట్స్ కాలేజీలో సభ నిర్వహించాల్సి ఉండగా ప్రిన్సిపాల్ పోలీసుల అనుమతి లేదంటూ నిరాకరించారు. దీంతో బీజేపీ లీగల్ శుక్రవారం ఉదయం కోర్టును ఆశ్రయించగా.. విచారించి సభకు అనుమతి ఇచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధిస్తూ సీపీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఫ్లాష్..ఫ్లాష్
RELATED ARTICLES
Recent Comments