Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఐదుగురు మాజీ మావోయిస్టుల అరెస్ట్..

ఐదుగురు మాజీ మావోయిస్టుల అరెస్ట్..

బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు మాజీ మావోయిస్టుల అరెస్ట్..
కాళేశ్వరం సర్పంచ్ భర్తకు బెదిరింపులు
రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్..
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు మాజీ మావోయిస్టు సభ్యులను భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పోలీసులు మాజీ మావోయిస్టులను మీడియా ఎదుట హాజరుపర్చారు. ఐదుగురు మాజీ మావోయిస్టులు ట్రూప్ గా ఏర్పడి.. కాళేశ్వరం సర్పంచ్ భర్త వెన్నపురెడ్డి మోహన్ రెడ్డిని రూ.50 లక్షల ఇవ్వాంటూ బెదిరింపులకు గురి చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో కాళేశ్వరం చెక్ పోస్టు వద్ద పోలీసుల పెట్రోలింగ్ చేస్తుండగా.. స్విఫ్ట్ కారులో ఐదుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు,పల్సర్ బైక్, రెండు డమ్మీ పిస్తల్స్, నాలుగు జిలిటెన్ స్టిక్స్, ఐదు మొబైల్ ఫోన్స్, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments