స్పాట్ వాయిస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీపురం కాలనీలో ఉన్న గోనెసంచుల గోదాములో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాము మొత్తం వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్య్కూట్ వల్లే మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, గోదాములో 40 వేల గోనెసంచులు ఉన్నాయని, సుమారు 50 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అన్నీ కాలిపోయాయని యజమాని వాపోయారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments