Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్స్పాట్ ఫ్లాష్.. వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం..

స్పాట్ ఫ్లాష్.. వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం..

కోట్లలో ఆస్తి నష్టం..

స్పాట్ వాయిస్, వరంగల్ : గీసుగొండ మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ.38 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గీసుకొండ మండలంలోని ధర్మారం గ్రామ పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన టెక్సో గోదాం ఉంది. ఇందులో పిల్లలకు సంబంధించిన బెడ్ షీట్లు, క్లాతులు ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో క్లాత్స్ మొత్తం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే ఎవరైనా కావాలని చేశారా.. లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments