Saturday, September 21, 2024
Homeకెరీర్అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌, ఆపరేటర్‌ పోస్టులు

అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌, ఆపరేటర్‌ పోస్టులు

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర పోలీసు నియామక మండలి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
అర్హత ఇలా..
కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ కాగా.. వయస్సు జూలై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు పెంచారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ తేదీ నాటికి రెండేళ్లు.. అంతకంటే ముందు హెవీ మోటర్‌ వెహికిల్‌ లైసెన్స్‌ పొంది ఉండాలి. పూర్తి వివరాలు వెబ్‌సెట్‌లో చూసుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments