Wednesday, April 16, 2025
Homeక్రైమ్పూరి గుడిసె దగ్ధం

పూరి గుడిసె దగ్ధం

పూరి గుడిసె దగ్ధం

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని తిమ్మాపూర్ లో దేవరాజు లక్ష్మయ్య చెందిన పూరి గుడిసె దగ్ధమైంది. శనివారం ఉదయం పనులు నిమిత్తం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం గుడిసెలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో బట్టలు, బియ్యం, వంట పాత్రలు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.  కట్టుబట్టలతో రోడ్డునపడ్డ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments