Thursday, November 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్గుడ్ న్యూస్... 80,039 వేల పోస్టుల భ‌ర్తీ

గుడ్ న్యూస్… 80,039 వేల పోస్టుల భ‌ర్తీ

95 శాతం స్థానికులకే..
ఇయ్యాల్టీ నుంచే ప్రక్రియ షురూ
ప్రకటించిన సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. యువతను పట్టించుకోవడం లేదనే మచ్చను తొలిగించుకునేలా ప్రకటన చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ పేర్కొన్నారు. ఒకేసారి దాదాపు 80,039 వేల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వేస్తామని చెప్పారు. ప్రత్యేక రాష్ర్టం కోసం విద్యార్థులు ఉద్యమం చేశారు. వారి బాగు కోసం శ్రమిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక రాష్ర్టంలో 95 శాతం లోకల్‌ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని పేర్కొన్నారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే వస్తాయని చెప్పారు. అలాగే 11,103 కాంట్రాక్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకర చేస్తామని ప్రకటించారు.
చాలా భర్తీ చేశాం..
రాష్ట్రంలో 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం 1,92,800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments