స్పాట్ వాయిస్, యాదాద్రి: యాదగిరి గుట్టలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. హోటల్ భవనం పైనుంచి దూకడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చెరుకూరి సురేశ్ (40), శ్రేష్ట (6)గా గుర్తించారు. మృతుడు సురేశ్ హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.
Recent Comments