ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిలిపివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా, బోధన ఆస్పత్రుల్లోనే కుటుంబ చికిత్సలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ఆపరేషన్ చేసిన సర్జన్ లైసెన్సును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తాత్కాలికంగా రద్దు చేసిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని చెప్పారు.
టార్గెట్లు తీసేశాం..
రాష్ట్రంలో కు.ని ఆపరేషన్లకు 2016 నుంచే టార్గెట్లు తీసేశామని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కు.ని సాధారణ శస్త్రచికిత్స అని, గతేడాది రాష్ట్రంలో 1.10 లక్షల మందికి ఆపరేషన్లు చేశామని వివరించారు. ఇందులో డీపీఎల్ పద్ధతిలో 24,233 సర్జరీలు జరిగాయని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే ఆపరేషన్లు, సిబ్బంది శిక్షణ జరుగుతున్నదని అన్నారు. అయినా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 శాతం మంది మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేసుకుంటున్నారని అన్నారు.
కు.ని చికిత్సల తాత్కాలిక నిలిపివేత..
RELATED ARTICLES
Recent Comments