వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
స్పాట్ వాయిస్, క్రైం: వాహనదారులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఫిబ్రవరి 15 వరకు ప్రభుత్వం పొడిగించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రస్తుతం గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువును పెంచుతూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సాంకేతిక సమస్యల నేపథ్యంలో మరో 15 రోజుల పాటు గడువును పొడిగించింది. టూ వీలర్స్, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ-చలాన్ వెబ్‌సైట్, పేటీఎం ద్వారా చలాన్లు చెల్లించుకునేలా అవకాశమిచ్చారు.
చలాన్ల రాయితీ గడువు పెంపు
RELATED ARTICLES
Recent Comments