హస్తానికి భారీ షాక్
స్థానిక విభేదాలే కారణమంటున్న నేతలు
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ వీడారు. ఏడాది కూడా పూర్తికాకముందే హస్తం దోస్తీకి కటీఫ్ చెప్పారు. కాగా.. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కోనేరు కోనప్ప.. ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పటంతో ఏ పార్టీలో చేరనున్నారన్న ప్రశ్నకు ఏమాత్రం తావివ్వకుండా.. ఇకపై ఏ పార్టీలో చేరనని, స్వతంత్రంగానే కొనసాగుతానంటూ స్పష్టం చేశారు. అయితే.. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టు కోనేరు కోనప్ప తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని కోనప్ప స్పష్టం చేశారు. అయితే.. తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి ఆయన తన మద్దతు ప్రకటించారు.
సిర్పూర్ లో విభేదాలు..
సిర్పూర్ కాగజ్‌నగర్ కాంగ్రెస్‌లో విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోనేరు కోనప్ప.. కాంగ్రెస్ పార్టీలో చేరగా గతకొంత కాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఇన్నాళ్లు అసహనంగా ఉన్న ఆయన తాజాగా తన అగ్రహాన్ని బహిరంగంగానే వెల్లగక్కారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల కంపెనీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్‌ను.. రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేయడంపై కోనప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని.. వాళ్లకు అంత సీన్ లేదంటూ కోనప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Recent Comments