విద్యుత్ తీగలు తగిలి వేటగాడికి తీవ్ర గాయాలు
స్పాట్ వాయిస్, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి అడవుల్లో అటవీ జంతులను వేటాడడం కోసం మండల కేంద్రానికి చెందిన తుమ్మ గంగయ్య అనే వేటగాడు విద్యుత్ తీగలు అమర్చుతుండగా తీగలు తగిలి గాయపడ్డాడు. విషయం తెలిసి సీఐ అనుముల శ్రీనివాస్, ఎ స్సై తాజుద్దీన్ 108 సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని అడవిలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం మోసుకు వచ్చి ఆంబులెన్సులో సామాజిక ఆసుపత్రికి తరలించారు. కాగా గంగయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Recent Comments