ఈటలకు వై కేటగిరి భద్రత
ప్రాణహాని ఉందన్న గంటల వ్యవధిలోనే కేంద్రం నిర్ణయం
స్పాట్ వాయిస్, బ్యూరో :ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. వై కేటగిరీ భద్రత కేటాయించింది. ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి రూ. 20 కోట్ల రూపాయలు ఇచ్చి ఈటలను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఈటల భార్య జమున మంగళవారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కేంద్రం స్పందించింది. ఈటలకు వై కేటగిరి కేటాయించింది. ఈటల భార్య జమున చేసిన ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి వై క్యాటగిరి భద్రతను కల్పించింది. సెక్యూరిటీకి సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recent Comments