Saturday, November 23, 2024
Homeజాతీయంతన హత్యకు కుట్ర జరుగుతోంది..

తన హత్యకు కుట్ర జరుగుతోంది..

పక్కా ప్లాన్ ప్రకారమే మునుగోడులో నాపై దాడి..
ఒక్క రక్తపు బొట్టు చిందినా కేసీఆరే బాధ్యత వహించాలి..
సీఎం చెంచాలకు బీజేపీ భయపడదు..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
స్పాట్ వాయిస్, హైదరాబాద్ :
తన హత్యకు కుట్ర జరుగుతోందని, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక్క రక్తపు బొట్టు చిందినా  సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో అవసరం లేకున్నా.. అనేక మందికి గన్ లైసెన్సులు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఆడిస్తే ఆడే.. చెంచాలకు బీజేపీ భయపడదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమితో తనపై కేసీఆర్ పగ పట్టారన్నారు. మునుగోడులో కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారన్నారు. కేంద్రమంత్రికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బయటకు వెళితే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం కేసీఆర్ హయాంలో లేకుండా పోయిందని ఈటల పేర్కొన్నారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీలో నేను సభ్యుడినన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని, నాపై ఈగ వాలితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. అనేక సార్లు నా కాన్వాయ్ పై దాడి చేసేందుకు యత్నించారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. నా భార్య జమున తన సొంత ఊళ్లో ప్రచారానికి వెళితే అడ్డుకునే ప్రయత్నం చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని, టీఆర్ఎస్ దాడులను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారని, జెండా కర్రలతో కొట్టారని, తన గన్ మెన్లు లేకపోతే నా తలకాయ ఉండకపోయేదన్నారు. పలివెల ఘటనలో తన పీఆర్వో చైతన్య, గన్ మెన్ అంజయ్యకు గాయాలయ్యాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరం బయటకు వెళ్లినా సురక్షితంగా ఇంటికి చేరేదని, ప్రస్తుతం టీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో బయటకు వెళితే తిరిగొచ్చే నమ్మకం లేకుండాపోయిందన్నారు. పలివెలలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి డీఎస్పీని కొట్టారని, డీజీపీ పోలీసు విలువలు కాపాడడంలో విఫలమయ్యారన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments