Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఆయన అంతం..నా పంతం

ఆయన అంతం..నా పంతం

ఆయన అంతం..నా పంతం
గజ్వేల్ అయిన.. హుజురాబాద్ అయినా రెడీ..
ఫేస్ టు ఫెస్ పోటీ పడుదాం..
కేసీఆర్‌ని ఓడిస్తేనే నా జీవితానికి సార్థకం
ఆయన ఓటమే నా మిషన్

కేసీఆర్ టార్గెట్ గా దూసుకెళ్తున్న ‘ఈట’ల

స్పాట్ వాయిస్, హుజూరాబాద్: టీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజూరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు వాస్తవాన్ని చూడలేని కబోదులన్నారు. ఈ సందర్భంగా ఈటల సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. హుజూరాబాద్ లోనైనా, గజ్వేల్ లో పోటీ చేసిన పర్వలేదని ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాని  ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్లే ఓడిపోయారని, తనదే అధికారమని వీర్రవీగడ సరికాదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, మోడీ పాలనలో దేశం ముందుకు పోతుందని. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అన్నారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ గెలిస్తేనే ధర్మం గెలిచినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు అని రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఆయన ఇప్పుడు బీజేపీలోకి రాబోతున్నారని చెప్పారు. రాజయ్య యాదవ్ గారు 2001 నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారని, మెదక్ జిల్లా ఇన్ చార్జిగా కూడా పనిచేశారన్నారు. షీప్ ఫెడరేషన్ కు చైర్మన్ గా పనిచేసిన ఆయన ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నారు. ఇంకా చాలామంది రాజీనామా చేసేవారు ఉన్నారని, ఎవరి ఊహకు అందనంత మార్పు జరుగుతుందన్నారు. పెద్ద ప్రళయం ఉంటుందని, ఇప్పటికే అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కేంద్ర పార్టీ కోరుకుంటుందని, అందులో భాగంగా తనకు ఒక బాధ్యత అప్పగించారన్నారు. గత 20 సంవత్సరాలుగా అన్ని పార్టీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయని, పార్టీ అప్పగించిన పనిని ధర్మబద్ధంగా నిర్వహించే ప్రయత్నం చేస్తానన్నారు. హుజురాబాద్ లోనూ టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పానలకు ఇంకో ఏడాది ఉంది కాబట్టి బిల్లులు రావాలని ఆగుతున్నారని, అన్నీ వచ్చిన తర్వాత చాలా మంది కాషాయం కండువా కప్పుకుంటారన్నారు.

  1. ప్రోటోకాల్ పాటించిన అధికార పార్టీ
    ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తలేదని, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తే కూడా పిలుపు ఇవ్వడం లేదని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా నా హక్కులకు, నా ప్రోటోకాల్ కు భంగం కలిగించలేదని గుర్తు చేశారు. తొమ్మిది నెలలుగా ఏ శంకుస్థాపన చేసిన ఆ శిలాఫలకం మీద నా పేరు లేదన్నారు. తాను గతంలో తెచ్చిన నిధులను పేరు మార్చి కొత్తగా శిలాఫలకాలు వేసుకుంటున్నారన్నారు. కేసీఆర్ ను ఓడించకపోతే తన జీవితంకు సార్థకత లేదన్నారు. తన పోరాటం ఇక్కడ ఉన్న వారితో కాదు కేసీఆర్ తో.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నారు. నాది ఇప్పుడు కేసీఆర్ ఓడగొట్టే మిషన్ అని చెప్పారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments