Thursday, May 29, 2025
Homeతెలంగాణచిల్లర వేశాలు బంద్ చేయాలె..

చిల్లర వేశాలు బంద్ చేయాలె..

 

స్పాట్ వాయిస్ కమలాపురం : జైలు నుంచి విడుదలైన కమలాపురం బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురువారం రాత్రి ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ.. 20ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలిసి పనిచేసుకునే పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజూరాబాద్ అని చెప్పారు.
అధికారం ఎవరీ శాశ్వతం కాదని , బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త, చిల్లర వేశాలు మాని,ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనస్సు గెలువాలి సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసులకు భయపడరన్నారు.హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ పగపట్టాడని ఆరోపించారు. పగపట్టి చాలా మందికి హుజూరాబాద్ లో లైసెన్స్ తుపాకులు ఇచ్చారని, పోలీసులు ఏకపక్షంగా మారి అధికార పార్టీకి తోత్తులు అయ్యారని మండిపడ్డారు.
బీజేపీ నాయకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెల్లి చిత్రహింసలు పెట్టారన్నారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని గుర్తుo చ్చు కోవాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments