కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రోళ్ల కుమార్ గౌడ్
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఆదివారం కబడ్డీ అసోసియేషన్ అన్ని మండలాల కమిటీ సభ్యులంతా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా రఘునాథపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల కుమార్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా పి.మల్లారెడ్డి, యు. రాజ్ కుమార్, కే. మోహన్ రావు, ఎన్. రాజన్న యాదవ్, పి. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గా తోటకూరి గట్టయ్య యాదవ్, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ టి.వెంకటేశ్వర్లు యాదవ్, ఏ. కుమార్, పి.మౌనిక, ఎం. సందీప్, ఓ.సురేష్, కోశాధికారిగా ఈ.ఉప్పలయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కే శ్రీకాంత్ గౌడ్, బి. శ్రీకాంత్, ఎండీ అస్లాం పాషా, ఎం చందు, టీ మహేష్, ఎన్ సురేందర్, టి రమేష్ గౌడ్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కబడ్డీ క్రీడకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన నియమానికి సహకరించిన మండల, జిల్లా నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అతి త్వరలోనే జనగామలో జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంచరించే విధంగా పాటుపడతానని అన్నారు .ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఆటలు ప్రతి ఒక్కరు ఆడే విధంగా క్రీడాకారులు చేయాలని మానసిక ఉల్లాసం ఉత్తేజం ఏర్పడుతుందని ఆయన అన్నారు .
Recent Comments