Monday, April 21, 2025
Homeజాతీయంమళ్ళీ ఎదురు కాల్పులు..

మళ్ళీ ఎదురు కాల్పులు..

మళ్ళీ ఎదురు కాల్పులు..

ఆరుగురు మావోయిస్టులు మృతి..

స్పాట్ వాయిస్, బ్యూరో: మావోయిస్టు లకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం ఉదయం ఝార్ఖండ్‌లో భారీ ఎన్​కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో ఎస్‌ఎల్‌ఆర్‌, రెండు ఇన్సాస్‌ రైఫిల్‌ స్వాధీనం, ఒక పిస్టల్​ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments