భారీ ఎన్ కౌoటర్..
16 మంది మావోయిస్టులు మృతి
స్పాట్ వాయిస్, క్రైమ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. 16మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గోగుండా కొండపై మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు శనివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Recent Comments