22 మంది నక్సల్స్ హతం..
ఒక జవాన్ సైతం మరణం..
స్పాట్ వాయిస్, బ్యూరో: ఛత్తీస్‌గఢ్-బీజాపూర్ అడవులు దద్దరిల్లాయి. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. బీజాపుర్‌లో 18మంది, కాంకెర్ ప్రాంతంలో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఎదురుకాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్‌కు చెందిన ఒక జవాను అమరుడైనట్లు పేర్కొన్నారు. బీజాపుర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు గురువారం ఉదయం 7గంటల నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలిలో 18 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక, ఇదే సమయంలో కాంకెర్ జిల్లాలోనూఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. రెండు జిల్లాల్లోనూ ప్రస్తుతం యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒక్క రోజే రెండు ఎన్ కౌంటర్లు..
RELATED ARTICLES
Recent Comments