స్పాట్ వాయిస్, గణపురం: కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ ప్రధాన గేటు ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో కేటీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నాచేపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధులు బహిష్కరణ పిలుపు మేరకు.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంటులో చట్టం కాబోతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15లక్షల ఉద్యోగుల జీవితాలను కాలరాసి, బిల్లును ఆమోదించడానికి కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Recent Comments