Tuesday, December 3, 2024
Homeజనరల్ న్యూస్మహిళలను సన్మానించిన ఎమ్మెల్సీ సిరికొండ

మహిళలను సన్మానించిన ఎమ్మెల్సీ సిరికొండ

స్పాట్ వాయిస్, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు తెలంగాణ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని మంగళవారం కుందన్ బాగ్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మహిళలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నదని తెలిపారు. మహిళల కోసం మన రాష్ర్టంలోనే ప్రత్యేక పథకాలు అమలువుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, హీరో ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments