స్పాట్ వాయిస్, నక్కలగుట్ట: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక యాప్‌లను ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ విద్యుత్ సరఫరాలో సమస్యలు, ఇతర వాటిని పరిష్కరించడానికి వినియోగదారులు కన్సూమర్ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యమవుతోందని వినియోగదారుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగదారుల నుంచి సులభతరమైన పద్ధతిలో ఫిర్యాదులు స్వీకరించడానికి వెబ్, మొబైల్ ఆధారిత పోర్టల్ ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 28న రెడ్ హిల్స్‌లోని సింగరేణి భవన్‌లో ఈ సరికొత్త పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు తెలంగాణ స్టేట్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్ సీ) కార్యదర్శి డాక్టర్ ఉమాకాంత పాండ తెలిపారు.
Recent Comments