యువమోర్చా బలోపేతమే లక్ష్యం
బీజేపీ యువ మోర్చా వరంగల్ అధ్యక్షుడు చిన్న
స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్: ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు గోదాసి చిన్న అన్నారు. ఆదివారం వరంగల్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ యువ మోర్చా అధ్యక్షులు గోదాసి చిన్న అధ్యక్షతన బీజేవైఎం కార్యకర్తల జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి, జిల్లా యువ మోర్చా ప్రభారీ బండి సాంబయ్య యాదవ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ నూతనంగా వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా నియామకమైన గోదాసి చిన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోదాసి చిన్న ఆధ్వర్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఇచ్చిన పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చార. అనంతరం యువ మోర్చా జిల్లా ప్రభారీ బండి సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల గత అధ్యక్షుడిని తొలగించడం జరిగిందని, అప్పటినుంచి సంస్థాగత నిర్మాణంలో యువ మోర్చా వెనుకబడిందన్నారు. నూతన అధ్యక్షుడు గోదాసి చిన్న ఆధ్వర్యంలో జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డివిజన్, మండల కమిటీలు త్వరితగతిన పూర్తి చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువ మోర్చా పనితీరు చూపించాలని ఆయన కోరారు.
బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోదాసి చిన్న మాట్లాడుతూ.. జిల్లా పునర్విభజన అనంతరం అనివార్య కారణాలతో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మారడం వల్ల జిల్లా, మండల కమిటీలు అసంపూర్తిగా ఉన్నాయని, జిల్లా కమిటీలో కష్ట పడి పని చేయడానికి ఆసక్తి ఉన్నవారు తమ వివరాలు ఇవ్వాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అనుమతితో వారి తగిన బాధ్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు ఎలాంటి భేషజాలకు పోకుండా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్ కుమార, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు అరకట్ల ప్రవీణ్ చౌదరి, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు నూనె అనిల్, సునీల్, పెంచాల సతీశ్, గోవింద్ సింగ్, హరీష్, సునీల్, విష్ణు, శేఖర్, శివ, రాజు కుమార్ డివిజన్ అధ్యక్షులు,యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments