ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
స్పాట్ వాయిస్, వరంగల్: రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో హన్మకొండలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ మహాసభ-2022 సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. విశ్వబ్రాహ్మణులను ఏకం చేయడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు సంఘటిత శక్తిగా ఎదగాలన్నారు. సంఘాన్ని బలోపేతం చేసేలా కమిటీలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంఘానికి చెందిన వారంతా వివిధ వర్గాలుగా కాకుండా ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా ప్రభుత్వ పథకాలు వందశాతం సాధించుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ జన గణన వేగవంతంగా జరపాలన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తనకు ఏ అవకాశం వచ్చినా విశ్వబ్రాహ్మణ జాతి సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. అనంతరం విశ్వబ్రాహ్మణ కుల పెద్దలు, స్థానిక నాయకులు సిరికొండను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్సీ సిరికొండ
RELATED ARTICLES
Recent Comments