రేవంత్ వెంట డెక్కన్ క్రానికల్ ఎడిటర్..
శ్రీరామ్ అతిపై సీపీఆర్వో, పీఆర్వోల గుస్సా..
గతంలో రాహుల్, సోనియాపై కర్రి అవాకులు, చెవాకులు..
సీఎం తీరును తప్పుబడుతున్న పార్టీ పెద్దలు..
స్పాట్ వాయిస్, బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో డెక్కన్ క్రానికల్ ఎడిటర్ ను వెంట పెట్టుకోని తిరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వెంటే సాగుతూ, అన్నింట్లో అతి చేస్తున్నాడని ఎడిటర్ శ్రీరామ్ కర్రి పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా శ్రీరామ్ కర్రిని సీఎం తనతో పాటు దావోస్ పర్యటనకు తీసుకెళ్ళడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అధికారిక పర్యటన మీడియా బాధ్యతలు ప్రైవేట్ పత్రిక ఎడిటర్ చూడడంపై సీఎంవో అధికారులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల వ్యవహారాలు చూసేందుకు తెలంగాణ బిడ్డలు సీపీఆర్వో, పీఆర్వోలుగా ఉండగా, ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ కర్రి అనే వ్యక్తి అతి జోక్యంపై తెలంగాణ జర్నలిస్టులు కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్, సోనియా గాంధీను శ్రీరాం కర్రి అనరాని మాటలు అన్నారని, ఆయనను విదేశీ పర్యటనలకు ఎలా తీసుకెళ్తున్నారని పలువురు పార్టీ పెద్దలు కూడా విమర్శలు ఎక్కుపెట్టినట్టు సమాచారం. కాగా, సదరు డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరామ్ గతంలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి దగ్గర పీఆర్వోగా, బండి సంజయ్ కోసం అన్అఫీషియల్‌గా పని చేశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి దగ్గర చేరడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా శ్రీరామ్ కర్రి తీరుపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు పలు ఫిర్యాదులు వెల్లినట్టు వినికిడి.
Recent Comments