హైదరాబాద్ లో పలువురి ఇంట్లో సోదాలు
స్పాట్ వాయిస్, బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. మంగళవారం ఉదయం దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహించారు. సోదాలు జరుపుతున్న విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై సహా మరో 5 గురుపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రాబిన్ డిస్ట్రిలర్స్ పేరుతో రామచంద్రన్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరుతో పాటు హైదరాబాద్‌లో రామచంద్రన్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రన్‌కు సంబంధించిన కంపెనీతో పాటు ఇంట్లో కూడా ఈడీ దాడులు చేపట్టింది. రామచంద్రన్‌తో పాటు బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై సోదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ షురూ..
RELATED ARTICLES
Recent Comments