ఫ్లాష్.. ఫ్లాష్..
ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చిన కవిత
8గంటలకు పైగా విచారణ
మార్మోగిన జై తెలంగాణ నినాదాలు
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఉదయం11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా అధికారులు ఆ సమయాన్ని పెంచారు. అయితే.. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మీడియా, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. 8గంటలకు బయటికి రాగా.. బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేసులో విచారణ ఇంకా ముగియలేదని.. మార్చి 16వ తేదీన కవితను మళ్లీ విచారించనున్నట్లు తెలిపారు.
ముగిసిన ఈడీ విచారణ…
RELATED ARTICLES
Recent Comments