Friday, September 20, 2024
Homeజాతీయంఆర్థిక మాంద్యం ఎఫెక్ట్..

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్..

18వేల ఉద్యోగాలు ఊస్ట్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, కరోనా మళ్లీ పడగ విప్పడంతో గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజాలు కాస్ట్ కట్టింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులకు పిక్ స్లిప్‌లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ఈ కామర్స్ జెయింట్ అమెజాన్ ఎంప్లాయీస్‌కు షాక్ ఇచ్చింది. అందులో పనిచేసే 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గతేడాది నవంబర్ నెలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. జనవరిలో మరో 18వేల మందిని ఇంటికి పంపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని సీఈవో ఆండీ జాస్సీ చెప్పారు. ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఎక్కువగా యూరప్‌లో ఉండనుంది. జనవరి 18 నుంచి విధుల నుంచి తొలగించే వారికి త్వరలోనే సమాచారం ఇవ్వనున్నట్లు సీఈవో ఆండీ జాస్సీ చెప్పారు. అయితే, సహచర ఉద్యోగి ఒకరు ఈ సమాచారాన్ని ముందుగానే లీక్ చేయడం వల్ల అకస్మాత్తుగా ఉద్యోగులతో ఈ సందేశాన్ని పంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ చివరి నాటికి అమెజాన్‌ కంపెనీలో 1.54 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments