Friday, September 27, 2024
Homeలేటెస్ట్ న్యూస్అయ్యో.. అంతా పుచ్కేనా..!

అయ్యో.. అంతా పుచ్కేనా..!

అయ్యో.. అంతా పుచ్కేనా..!
ఎర్రబెల్లి సవాల్‌పై సైలెంట్
మాటల్లోనే గాంభీర్యం.. చేతల్లో శూన్యం
ఓటమి భయమేనా..?
ప్రతిపక్షాలకు బలం కానున్న నన్నపునేని తీరు

స్పాట్ వాయిస్, వరంగల్ : అంతా పుచ్ కే.. సవాల్ స్వీకరించేది లేదు.., ప్రతిగా మరోటి విసిరేది అంతకన్నా లేదు. ఆవేశంగా మాట్లాడి., తర్వాత నాలుక కరుచుకున్నారా.. అన్నట్టుంది తూర్పు నేత పరిస్థితి. రిజైన్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు విసిరిన చాలెంజ్ ను ఇంత వరకు ఆయన స్వీకరించకపోవడంతో ప్రజలంతా నరేందర్ మాట్లాడిందంతా తూచ్.. ఏదో అప్పుడు ఆవేశంగా మాట్లాడుంటాడలే .. అని సర్ది చెప్పుకుంటున్నారు. సరేలెండి.. ఎవరెన్ని అనుకుంటేఏమీ, ఎవరెలా నవ్వుకుంటేనేమీ.. మన పని మనం చేసుకుంటూ పోతే సరిపోయే అనుకుంటే అయిపాయె.

సవాళ్లు ప్రతిసవాళ్లు ఉంటేనే యుద్ధం. వాటిని స్వీకరిస్తేనే నిజమైన సమఉజ్జీ తనం. ఏదో నరం లేని నాలుక ఉంది కదా అని మాట్లాడి, ఆ తర్వాత తోక ముడిస్తే అది యుద్ధతంత్రం అనిపించుకోదు, వారిని సమఉజ్జీలు అనలేం. ఇప్పుడు తూర్పున జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇదే అనిపిస్తోంది. సవాల్ విసిరిన వారు దూసుకొచ్చిన ప్రతిసవాల్ ను స్వీకరించాలి కానీ గడువు ముగుస్తున్నా స్పందన కానరావడం లేదు. మరి దీనిని ఏమనుకోవాలో మొదలు పెట్టిన వారే చెప్పాలని జనాల్ ప్రశ్నిస్తున్నారు. లేదంటే అంతా తూచ్.. ఏదో ఆరోజు అలా అనాల్సి వచ్చింది, అదంతా ఏమీ లేదని ప్రకటనైనా ఇవ్వాల్సింది అని సలహాలు ఇస్తున్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అంతా పుచ్ కేనా.. అని నవ్వుకుంటున్నారు.

సవాల్‌పై సైలెంట్
తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాటల్లోనే గాం భీర్యం ప్రదర్శించాడని, చేతల్లో మాత్రం ఏమీ లేదని ప్రజ లు పేర్కొంటున్నారు. నిజంగా తాను ప్రజా మనిషిగా నిరూపించుకోవాలంటే, అతడిది నిజమైన ప్రజాబలమే అయితే ఏ మాత్రం తాత్సరం చేయకుండా ప్రదీప్ రావు విసిరిన సవాల్ స్వీకరిస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్లాల్సింది. కానీ, రోజులు గడుస్తున్నా, గడువు మరి కొన్ని గంటలే ఉన్నా ఉలుకు పలుకు లేకుండా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, పార్టీ శ్రేణుల ముం దు మాట్లాడడం కాదు, నలుగురి ముందు సవాల్ స్వీ కరించే నేతగా ముందుకు రావాలని సూచిస్తున్నారు.

ఓటమి భయమేనా..?
‘‘నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నప్పుడు నన్నపునేని నరేం దర్ కార్పొరేటర్ మాత్రమే. నేను టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాతే ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. అతడి గె లుపుకోసం అధిష్టానం నన్ను శ్రమించాలని ఆదేశిస్తే, శి రసా వహించాను. నరేందర్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కష్టపడ్డాను. అధి నిజం కాదనిపిస్తే ఇ ప్పటికిప్పు డు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలి’’ అని ప్ర దీప్ రావు నన్నపునేనికి సవాల్ విసిరారు. దానికి డెడ్ లై న్ ఈనెల 10 వ తేదీగా నిర్ణయించారు. కానీ, ఇప్పటి వ రకు కూడా నన్నపునేని నరేందర్ ఆ సవాల్ పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మళ్లీ ప్రజా క్షేత్రం లో గెలవ డం కష్టమనే భావించి ఉంటాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు.

ప్రతిపక్షాలకు బలం కానున్న నన్నపునేని తీరు
నన్నపునేని నరేందర్, ప్రదీప్ రావు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల ఎపిసోడ్ ఇప్పుడు ప్రతిపక్షాలకు బలంగా మారే అ వకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీ నేతలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏ మాత్రం వెనకాడబోవనేది సుస్పష్టం. ఇప్పటికే తూర్పులో అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చేపకింద నీరులా మారిన విషయం తెలిసందే. ఇప్పుడు బహిరంగ సమస్యలు పార్టీని మరింత ఇరకాటంలో పెట్టే అవకాశాలు లేకపోలేదనే ఎవరు కాదనలేని నిజం. ఏది ఏమైనా ఎవరికి వారుగా సృష్టించుకున్న వలలో వారే పడాల్సిందే అనే వాస్తవాన్ని గమనించాలనే వారు లేకపోలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments