Saturday, April 5, 2025
Homeతెలంగాణతూర్పు రాజకీయం ఎఫెక్ట్..

తూర్పు రాజకీయం ఎఫెక్ట్..

తూర్పు రాజకీయం ఎఫెక్ట్..

మంత్రి కొండా ముఖ్య అనుచరుడికి గన్ మెన్ల తొలగిo పు 

స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ తూర్పు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నేత, నవీన్ రాజ్ కు ఉన్న ఇద్దరు గన్మెన్లను కమిషనరేట్ పోలీసులు తాజాగా తొలగించారు. దీంతో గన్మెన్లు హెడ్ క్వార్టర్ ఏఆర్ విభాగంలో రిపోర్ట్ చేశారు. నవీన్ రాజ్ పై ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. మంగళవారం విధుల్లో ఉన్న హనుమకొండ ఇన్స్ పెక్టర్ సతీశ్ పై నవీన్ రాజ్ దురుసుగా ప్రవర్తించడం, పదుల సంఖ్యలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు అందడం, ఏకంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసు శాఖ గన్మెన్లను తొలగించింది. తూర్పు, పరకాల నియోజకవర్గాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలపై ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు సమాచారం. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు తొలగించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments