Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్పప్పులో వానపాము..

పప్పులో వానపాము..

ప్రభుత్వ గిరిజన పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
మానుకోటలో ఘటన
స్పాట్ వాయిస్, మానుకోట: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థులను వెంటనే మహబూబాబాద్ ఏరియా హస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వానపాము పడ్డ పప్పు, కిచిడి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్డెన్ పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పందించిన మంత్రి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యాయి. ప్రత్యేక అధికారిని నియమించిన మంత్రి, బాధ్యులను గుర్తించి, వారి పై చర్యలకు ఆదేశించారు. కలెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ, ఆసుపత్రి సూపరింటెండెంట్, అధికారులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి, విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స తో పాటు నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సివిల్ సప్లై గోడౌన్ లను, గురుకులలాల్లో స్టోర్ రూమ్ లను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇకపై గిరిజన గురుకులాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

వార్డెన్ స్వామి సస్పెండ్
గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు స్పందించారు. వార్డెన్ స్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్, విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments