Friday, September 20, 2024
Homeకెరీర్డీఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

డీఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
ఇదే షెడ్యూల్..
జూలై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష
జూలై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జూలై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జూలై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జూలై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జూలై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష
జూలై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

2.79 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా హైదరాబాద్​ జిల్లా నుంచి 27,027 ఆ తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments