పార్టీ వాళ్లు, మీడియా మా ఇంటి వైపు రావొద్దు..
డీఎస్ భార్య విజయలక్ష్మి
నిన్ననే పార్టీలో చేరిన శ్రీనివాస్..
ఈరోజు రాజీనామా
స్పాట్ వాయిస్, నిజామాబాద్: మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆదివారం కాంగ్రెస్ లో డీ శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ చేరారు. అయితే సోమవారం డీఎస్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను రాస్తున్న వీడియోను విడుదల చేశారు. డీ శ్రీనివాస్ రాజీనామా విషయాన్ని ఆయన భార్య విజయలక్ష్మి వీడియో ద్వారా వెల్లడించారు. నమస్తే ఇది డీ శ్రీనివాస్ రాజీమానా ..నేను చెప్పదల్చుకున్నది ఏంటీ అంటే కాంగ్రెస్ వాళ్లు కానీ..మీడియా వాళ్లు కానీ ఇటువైపు రాకండి..అని డీ విజయలక్ష్మీ వీడియోలో స్పష్టం చేశారు.
రాజకీయాలకు దూరంగా..
ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..డీఎస్ ను పార్టీలో చేర్చుకునే విధానం ఇది కాదు..డీఎస్ అనారోగ్యంతో ఉన్నారు. మీ రాజకీయాలకు డీఎస్ ను వాడుకోవద్దని డీఎస్ భార్య విజయలక్ష్మి స్పష్టం చేశారు. అటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్ తెలిపారు. తనను వివాదాల్లోకి లాగొద్దని డీఎస్ విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు పంపారు.
Recent Comments