Saturday, April 5, 2025
Homeతెలంగాణధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్ ) కన్నుమూత 

ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్ ) కన్నుమూత 

ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్ ) కన్నుమూత 

స్పాట్ వాయిస్, బ్యూరో : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన, నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments