అవేకన్ అదిరింది..
స్పాట్ వాయిస్, క్రైం: మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. కేఎంసీ మైదానంలో అవేకన్ పేరిట సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. మంత్రి దయాకర్ రావు, సీపీ తరుణ్ జోషి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని సందడి చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థి, యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా ఉన్నత ఆశయంతో ఎదగాలన్నారు. మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగారావు, సీపీ తరుణ్షి, నిట్ డైరెక్టర్ ఆచార్య రమ ణారావు, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్.. మత్తు పదార్థాలకు బానిసలైతే జరిగే నష్టాలను వివరించారు. విద్యార్థులతో సీపీ ‘నో టు ది డ్రగ్స్’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవిత ఆశ యాలను కోల్పోయిన జాతీయ క్రీడాకారు లతో కలిసి మత్తుపదార్థాలతో జరిగే నష్టా లను వివరించే నో టు ది డ్రగ్స్ నినాదా లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. డిజైనర్ రాం అగర్వాల్ రూపొందించిన విభిన్న దుస్తుల్లో మోడల్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో వావ్ అనిపించిది. అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ కళాకారుడు వేణు గోపాల్ ఇసుకతో ఓరుగల్లు కోట, పర్యాటక ప్రాంతాలు, భద్రకాళీ ఆలయం, నిట్, కేఎంసీలను వేసి అబ్బురపరి చారు. ఈ కార్యక్రమ ములో చివరగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నయూ కిరణ్ సెంటర్ అందించిన చిక్సిత, కౌన్సిలింగ్ తిరిగి సాధారణ స్థితి చేరుకున్న యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేశారు.
ఈ కార్యక్రమములో వరంగల్ ,హనుమకొండ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీహన్మంతు, గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీపీ వెంకటలక్ష్మి , అశోక్ కుమార్, సీతారాం, అదనపు డిసీపీ పుష్పా, వైభవ్ గైక్వాడ్ తో పాటు ఏసీపీలు, స్పెక్టర్లు,బన్ను సేవా సంస్థ ప్రతినిధులు,విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments