Thursday, November 21, 2024
Homeజిల్లా వార్తలుసంఘాల పేరిట బెదిరింపులకు గురిచేస్తే ఊరుకోం..

సంఘాల పేరిట బెదిరింపులకు గురిచేస్తే ఊరుకోం..

పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్
స్పాట్ వాయిస్, వరంగల్: ఉపాధ్యాయ సంఘాల పేరిట కొంతమంది ఉపాధ్యాయుల్లో గందరోగోళం సృష్టిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని,‌ అట్లాంటి వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు ఉంటాయని, సంఘాలు పెట్టుకునే హక్కు కూడా ఉంటుందన్నారు. సంఘాలు అనేవి సంస్థల, సభ్యుల అభివృద్ధికి మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతాయని తెలిపారు. బలవంతంగా తమ సంఘంలో చేర్చుకునే ప్రయత్నంలో కొంతమంది విపరీత మనస్తత్వంతో వ్యవహరిస్తూ బెదిరింపులకు గురి చేసినంత మాత్రాన బలమైన నాయకులుగా తయారవ్వరని.. సైద్దాంతిక భావజాలంతో నిర్మాణాత్మకంగా పనిచేస్తేనే వ్యక్తులు నాయకులుగా తయారవుతారన్నారు. అంతేగాని బెదిరింపులు గొడవలు సృష్టిస్తూ, హుకుం జారీ చేస్తూ , నియంతృత్వ పోకడలతో సామాజిక వివక్షతతో వ్యవహరిస్తే వారికి కాలమే సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. అలాంటి వారి మాటలను విజ్ఞులైన ఉపాధ్యాయులు ఎవరు నమ్మకూడదని, విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. బెదిరింపులకు గురి చేసే వారికి పీఆర్టీయూ తెలంగాణ నాయకులు, ఉపాధ్యాయులు ఎవరు భయపడరని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నయ్య ,అబ్దుల్లా గౌరవ పెద్దలు శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోలి పద్మక్క, మన్నె చంద్రయ్య తదితరుల ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళతూ… ప్రొఫెసర్ జయశంకర్., చుక్కారామయ్య., ప్రొఫెసర్ కోదండరాం., శాసనమండలి మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి స్ఫూర్తితో సామాజిక స్పృహతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తామని దేవేందర్ ముదిరాజ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments