అలా చేస్తే తల్లిదండ్రులు సైతం శిక్షార్హులే..
గణపురం ఎస్సై అభినవ్
స్పాట్ వాయిస్, గణపురం: మైనర్లు వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, వారికి వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులు సైతం శిక్షార్హులేనని ఎస్సై అభినవ్ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా మండలంలో ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఇందులో ఎక్కువగా మైనర్లు ద్విచక్రవాహనాలు నడపడం గుర్తించామన్నారు. దీన్ని కట్టడి చేయాలని పిల్లలతో పాటు తల్లిదండ్రులకూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా వాహనం నడిపేందుకు వీలులేదన్నారు. అలా నడిపితే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత అన్నారు. పిల్లలపై పెద్దలు నిరంతరం నిఘా ఉంచాలని, తగిన వయస్సు వచ్చేంతవరకూ వారికి డ్రైవింగ్ నేర్పించకూడదన్నారు. చాలామంది చిన్న తనంలోనే ఖరీదైన వాహనాలు ఇప్పిస్తుండటంతోనే అధిక శాతం ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. మైనర్లు వాహనాలను నడుపుతూ పట్టుబడితే ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వాహనం యజమానికి, తల్లిదండ్రులకు జరిమానా విధించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వలన విలువైన ప్రాణాలతో పాటు, ఎదుటివారి ప్రాణాలకు కూడా హాని కలుగుతుందని ఎస్సై అభినవ్ సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు..
RELATED ARTICLES
Recent Comments