Friday, January 24, 2025
Homeక్రైమ్18నెలల పాపపై వీధి కుక్క దాడి..

18నెలల పాపపై వీధి కుక్క దాడి..

18నెలల పాపపై వీధి కుక్క దాడి..

తీవ్ర గాయాల పాలైన చిన్నారి..

మరో బాలుడిని సైతం కరిచిన కుక్కలు 

స్పాట్ వాయిస్, కాజీపేట: 18నెలల పాపతో పాటు.. మరో చిన్నారి పై కుక్కలు దాడి చేశాయ్. ఈ ఘటన కాజీపేట మండ‌లం భ‌ట్టుప‌ల్లి రాజీవ్ గృహకల్ప ఇళ్ల స‌ముదాయంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్ద‌రు చిన్నారుల‌పై వీధి కుక్క‌లు దాడి చేశాయి.ఈ దాడిలో 18నెలల పాప తీవ్రంగా గాయ‌ప‌డింది స్థానికులు ఇద్ద‌రి చిన్నారుల‌ను అంబులెన్స్‌లో ఎంజీఎంకు త‌ర‌లించారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఇటీవ‌ల వ‌రుస‌గా వీధి కుక్క‌ల దాడి ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పిల్లల పై దాడి చేసిన కుక్కను స్థానికులు చంపేశారు. తాజాగా ఓ కానిస్టేబుల్ ను కుక్క కరువగా కాజీపేటలో కుక్కల దాడిలో ఓ బాలుడి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments