Wednesday, May 7, 2025
Homeలేటెస్ట్ న్యూస్డాక్టర్లు డ్యూటీకి డుమ్మా..  

డాక్టర్లు డ్యూటీకి డుమ్మా..  

డాక్టర్లు డ్యూటీకి డుమ్మా..  

 15 మంది లో ఒక్కరూ రాలే.. 

 ఫైర్ అయిన కలెక్టర్.. 

స్పాట్ వాయిస్,వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన ని వరంగల్ కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ విజిట్ చేసే సమయానికి ఈ రోజు డ్యూటీలో ఉండాల్సిన 15 మంది డాక్టర్లు హాజరుకాకపోవడంతో కలెక్టర్ ఫైర్ అయ్యారు. పూర్తి వివరాలు బయోమెట్రిక్ , హాజరు రిజిష్టర్ తో వివరాలు జిల్లా కార్యాలయానికి పంపి,హాజరు కానీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ ను ఆదేశించారు. హాస్పటల్లో రోగులకు అందాల్సిన సేవలు పై అడిగి తెలుసుకున్నారు. తాగునీరు ఏర్పాటు చేయాలని ఓపీ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు…హాస్పటల్లో డ్యూటీ చేస్తున్న నర్సులు హాజరు రిజిష్టర్ ని పరిశీలించి చికిత్సకు హాస్పటల్ వస్తున్న వారిపట్ల మర్యాదగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments