Saturday, September 21, 2024
Homeజనరల్ న్యూస్నెలల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..?

నెలల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..?

స్పాట్ వాయిస్, డెస్క్: 
* ప్రారంభానికి ఆదిదేవత అయిన రోమ్ దేవత ‘జానూస్’ పేరిట తొలినెలకు ‘జనవరి’ అని నామకరణం చేశారు. జానూస్ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి గతం వైపు చూస్తుంటే.. మరోటి భవిష్యత్ వైపు చూస్తుంటుంది.
* ‘ఫెరు’ అనే రోమన్ పండుగ పేరు నుంచి ‘ఫిబ్రవరి’ పేరు ఏర్పడింది.
* రోమన్‌ల యుద్ధ దేవత పేరును అనుసరించి ‘మార్చి’.
* ‘ఎపెరిర్’ అనే లాటిన్ భాషా శబ్ధం నుంచి ‘ఏప్రిల్’.
* రోమన్‌ల దేవి పేరు ‘మయిమా’.. ఈ పదం నుంచి ‘మే’.
* స్వర్గానికి రాణి- ‘జానో’.. ఈ పదం నుండి ‘జూన్’
* ‘జూలియస్ సీజర్’ పేరు నుంచి ‘జులై’ .
* రోమ్ చక్రవర్తి పేరు ‘అగస్టన్’. ఈ పేరు ఆధారంగా ‘ఆగస్ట్’ నెల పేరు ఏర్పడింది.
* లాటిన్ భాషలో ‘సెప్టమ్‌’ ఆధారంగా ‘సెప్టెంబర్’ నెల
* ‘అకో’ అనే లాటిన్ శబ్దం నుంచి ‘అక్టోబర్’ నెల.
* ‘నవమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘నవంబర్’ నెల
* ‘డసమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుంచి ‘డిసెంబర్’ నెల పేరు వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments