జాతీయ రహదారిపై సహాయక చర్యలు..
స్పాట్ వాయిస్,దామెర: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని ఓగ్లాపూర్ సైలాని బాబా దర్గా వద్ద వరంగల్- భూపాలపట్నం జాతీయ రహదారిపై వరదనీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్, ఎస్సై ముత్యం రాజేందర్,ఎంపీఓ నాగరాజుతో కలిసి ఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.రోడ్డుపైకి వరద నీరు రాకుండా మరమత్తు చర్యలు చేపట్టి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చేశారు. అదేవిధంగా పులుకుర్తి గ్రామానికి వెళ్లే మార్గంలో వరద తాకిడి ఎక్కువ కావడంతో రాకపోకలు బంద్ చేసి రోడ్డును బ్లాక్ చేశారు.ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై సహాయక చర్యలు..
RELATED ARTICLES
Recent Comments