Monday, May 20, 2024
Homeటాప్ స్టోరీస్బైక్ పై 126 గొర్రెల తరలింపు..

బైక్ పై 126 గొర్రెల తరలింపు..

అంబులెన్స్.., ఫైర్ ఇంజిన్, నీళ్ల ట్యాంకర్లలోనూ తరలించారట..
గొర్రెల పంపిణీలో వింతవింతలు..
కాగ్ నివేదికలో వెలుగులోకి..

స్పాట్ వాయిస్, బ్యూరో: నలుగురు చూస్తే.. నవ్విపొదురుగా నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన గొర్రెల పంపిణీ తీరు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రారంభించిన గొర్రెల పంపిణీలో పథకం నిండా మోసాలే వెలుగు చూస్తున్నాయి. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఏడు జిల్లాల్లో తనిఖీ చేయగా రూ.253.93 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలతో పాటు తీవ్ర లోపాలను గమనించినట్లు పేర్కొంది. నకిలీ రవాణా ఇన్‌వాయిస్‌లు, నకిలీ వాహనాలు, వాహనాల్లో సామర్థ్యానికి మించి గొర్రెల యూనిట్ల రవాణా, గొర్రెలకు నకిలీ ట్యాగ్‌ల కేటాయింపు, తదితరాలు ఉన్నట్లు కాగ్ పేర్కొంది.

ఎన్నెన్ని సిత్రాలో..
2017-18 నుంచి 2019-20 కాలంలో ఐదు జిల్లాల్లో 96,299 గొర్రెల యూనిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారని కాగ్ వివరించింది. అయితే దాణా మాత్రం కేవలం 29,616 యూనిట్లకు మాత్రమే సరఫరా చేసినట్లు తేలిందని పేర్కొంది. దాదాపు 70శాతం యూనిట్లు దాణా తీసుకోలేదంటే గొర్రెల సరఫరాలో పలు మోసాలు జరిగినట్లు అనుమానించాల్సి వస్తోంది అభిప్రాయపడింది. ఇక సంగారెడ్డి జిల్లాలో ఒక మోటార్‌ బైక్‌పై 126 గొర్రెలు రవాణా చేసినట్లు, నల్గొండ జిల్లాలో ఒక ఆటోలో 126 గొర్రెలు రవాణా చేసినట్లు కాగ్‌ తనిఖీల్లో తేలింది. అంబులెన్స్‌ల్లో, అగ్నిమాపక వాహనాల్లో, నీళ్ల ట్యాంకర్లలో, మొబైల్‌ కంప్రెసర్‌లలో గొర్రెలు రవాణా చేసినట్లు చూపారని పేర్కొంది. ఒకే వాహనం ఒకే రోజు శ్రీకాకుళం, కడప జిల్లా నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాకు గొర్రెలు తరలించినట్లు చూపారని కాగ్ ఆడిట్‌లో తెలిపింది. గొర్రెను గుర్తుపట్టేలా వేసే ట్యాగులు కూడా మోసాలు జరిగినట్లు నిర్ధారిస్తున్నాయని కాగ్‌ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments