స్పాట్ వాయిస్, దామెర : మండలంలోని ఊరుగొండ గ్రామంలో స్థానిక ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దామెర ఎస్సై హరిప్రియ వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపద సమయంలో 100 కి కాల్ చేస్తే సాయం అందిస్తామని తెలిపారు. యూత్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Recent Comments