Friday, November 22, 2024
Homeజాతీయంరాహుల్ గాంధీపై అనర్హత వేటు

రాహుల్ గాంధీపై అనర్హత వేటు

ప్రకటించిన లోక సభ సెక్రటరీ జనరల్

స్పాట్ వాయిస్, బ్యూరో : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఇటీవల సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. 2019 కర్ణాటక రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా  దొంగలు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ సమయంలోనే గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ సూరత్‌ కోర్టులో రాహుల్ గాందీపై పరువునష్టం దావా వేశారు. నాలుగేళ్ల తరువాత విచారించిన కోర్టు… రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్‌ వివరణ ఇచ్చారు. అయితే కోర్టు మాత్రం రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్లు జైలు శిక్ష తో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండడానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments