రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు డిస్నీల్యాండ్ విద్యార్థి
స్పాట్ వాయిస్, దామెర: నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు హన్మకొండ జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీల్యాండ్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు చక్కటి ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. ఓపెన్ వెల్ ఆర్గానిక్ ఫామ్ అనే అంశంపై జిల్లా స్థాయిలో ఎం.నితిన్ (8వ తరగతి ప్రథమ స్థానం) సాధించి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యాడు. అలాగే జిల్లాస్థాయిలో తోట శివకేశవ (8వ తరగతి) ఈజీ లోడ్ క్యారియర్ ఫర్ లేబర్ అనే అంశంపై ప్రదర్శించిన ఎగ్జిబిట్ మూడోస్థానం, గట్టు అనన్య రెడ్డి (8వ తరగతి) ట్యూన్ మాస్ డంపింగ్ టెక్నాలజీ అంశంపై ప్రదర్శించి జిల్లా స్థాయిలో మూడో స్థానం సాధించాడు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చడంపై పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య,దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, డైరెక్టర్లు బాలుగు శోభా రాణి, దయ్యాల రాకేష్ భాను, దయ్యాల దినేష్ చందర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ, తృతీయ స్థానాలు పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస స్వామి చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందుకున్నారు. విద్యార్థులు ఉత్తమంగా రాణించేందుకు కృషి చేసిన గైడ్ టీచర్స్ ఎస్. శివాజీ, సీహెచ్.మధు,ఎం. రాజిరెడ్డి, సీహెచ్. ప్రసాద్, ఎం. సురేష్ బాబు, పి. రవికుమార్,కె. జయలక్ష్మి, ఎన్. భవ్య, వీఎల్. నాగశ్రీను పాఠశాల యజమాన్యం అభినందించారు.
Recent Comments