Thursday, May 22, 2025
Homeతెలంగాణడైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా రవీంద్ర నాయక్

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా రవీంద్ర నాయక్

విధుల నుంచి రిలీవ్ అయిన శ్రీనివాస రావు
స్పాట్ వాయిస్, బ్యూరో: డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌గా డాక్టర్‌ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్‌గా కొనసాగిన గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆయన విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు. కొత్త డీహెచ్‌గా రవీంద్ర నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. అలాగే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌గా రమేశ్‌రెడ్డి స్థానంలో త్రివేణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య సంచాలకులుగా ఐదేళ్లకుపైగా సేవలందించి, తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన వివిధ జిల్లాల వైద్య అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments