Sunday, April 6, 2025
Homeక్రైమ్విద్యుత్ షాక్ గురై మూడేళ్ల చిన్నారి మృతి

విద్యుత్ షాక్ గురై మూడేళ్ల చిన్నారి మృతి

స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మూడేండ్ల చిన్నారి కూలర్‌ వైరు ముట్టుకోగా.. విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దరావత్‌ భాస్కర్‌-కళ్యాణి దంపతులు ఇంటి వద్ద పని చేసుకుంటుండగా వారి కుమారుడు అర్జున్(3) ఇంటి పక్కనే ఉన్న అమ్మమ్మ కాంతమ్మ ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూలర్‌ వైర్లు పట్టుకోవడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని మహబుబాబాద్‌ దవాఖానకు తరలించగా..మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకు కావడంతో అర్జున్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ముడెండ్లకే చిన్నారి మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments