Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్ప్రజాపాలనా..! ప్రతీకార పాలనా..?

ప్రజాపాలనా..! ప్రతీకార పాలనా..?

కాంగ్రెస్ వి దిగజారుడు రాజకీయాలు..
శ్రేణులను భయబ్రాంతులకు గురి చేస్తే ఊరుకోం..
బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పి, ప్రతీకార పాలన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుందని అన్నారు. హామీలపై నిలదీస్తున్న బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా నీళ్లు,నిధులు, నియామకాలు అనే నినాదంతో అనేక ఉద్యమాలు చేసిన పార్టీ బీఆర్ ఎస్ అని, పదేళ్లలో బ్రహ్మాండంగా రైతాంగానికి సకాలంలో ఎరువులు, రైతుబంధు, రైతు బీమాను అందించామని రుణమాఫీ కూడా చేశామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ జిల్లా పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించిందని అన్నారు. మిగతా పార్టీలకు ఏ విధంగానైతే స్థలాలను కేటాయించిందో బీఆర్ ఎస్ పార్టీకి అలానే కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సర్వేనెంబర్ 1066 లో ఎకరం భూమిని బీఆర్ ఎస్ పార్టీ రూ. 4,84,000 కు కొనుగోలు చేసి పార్టీ కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు వాడుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయం పై మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కు జిల్లా పార్టీ కార్యాలయాలనికి కేటాయించిన భూమిని క్యాన్సిలేషన్ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారని అన్నారు. అధికారులు పంపిణీ నోటీసులకు వివరణతో కూడిన సమాధానాన్ని బుధవారం డిప్యూటీ కమిషనర్ కు అందించామని తెలిపారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కక్షపూరితంగా వ్యవహరించలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులపైన, తనపైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. శ్రేణుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments