మే 5న ధర్నా..
సమస్యల పరిష్కారానికి కదలిరావాలి..
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ రామా రాజేష్ ఖన్నా
స్పాట్ వాయిస్, వరంగల్: హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ స్కీం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మే 5 వ తేదీ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా నిర్వహిస్తున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ రామా రాజేష్ ఖన్నా (ఏఐటీయూసీ అనుబంధం) తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్ హెచ్ఎంలోని రెండో ఏఎన్ఎంలు డీఎస్ సీ ద్వారా నియామకమైన హెల్త్ అసిస్టెంట్ (మేల్ ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలోని ఏఎన్ఎంలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, స్టాఫ్ నర్సులు, బ్లాక్ లెవెల్ అకౌంటెంట్స్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎన్ఓలు, స్వీపర్లు, వాచ్ మెన్స్, కార్యాలయాల్లో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రోగ్రాం అధికారులు, 104 ఉద్యోగులు డ్రైవర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, బ్లడ్ బ్యాంక్ డ్రైవర్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ ఆర్సీ, డైక్ తదితర విభాగాల్లోని ఎన్హెచ్ ఎం ఉద్యోగులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాంటిజెంట్ వర్కర్స్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఓటీ టెక్నికాన్స్, ఇతర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ఇతర చట్టబద్ధ హక్కులు అమలు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం సమంజసం కాదన్నారు.
తెలంగాణ సెకండ్ పీఆర్సీని 2023 జూలై నుంచి అమలు చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచి రెగ్యులర్ చేయాలని, 7 నెలల ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, ఎంఎల్ హెచ్పీ ట్రైనింగ్ చేసిన వారిని బ్రిడ్జి కోర్స్ లోకి యథావిధిగా తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా డిమాండ్ల సాధనకు, సమస్యల పరిష్కారానికి మే 5వ తేదీన ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ కోఠిలో ఉన్న ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చినట్టు, రాష్ట్రంలోని ఉద్యోగులందరూ తప్పకుండా హాజరు కావాలని రామా రాజేష్ ఖన్నా విజ్ఞప్తి చేశారు.
Recent Comments